Current Affairs Telugu Daily

తెలంగాణ నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి 
హైదరాబాద్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మహేందర్‌రెడ్డి రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు' అప్పగిస్తూ 2017 నవంబర్‌ 10న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మను హోంశాఖ సలహాదారుగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 1986 బ్యాచ్‌కి చెందిన మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువుకున్నారు. రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్‌, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు జాతీయ పోలీసు అకాడమీలో బాధ్యతలు నిర్వహించిన ఆయన చంద్రబాబునాయుడు హయంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ కమిషనరేట్‌కు మొదటి కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇక్కడ ఆయన పోలీసుశాఖలో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. స్నేహపూర్వక పోలీసింగ్‌ పేరుతో అనేక ప్రయోగాలు చేశారు. 
views: 1108

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams