Current Affairs Telugu Daily

జీఎస్‌టీ 23వ సమావేశం
వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) 23వ సమావేశం 2017 నవంబర్‌ 10న గౌహతిలో నిర్వహించారు. ఈ సమావేశంలో సామూహిక, రోజువారీ వినియోగం వున్న 213 వస్తువులపై పన్నులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గరిష్ట శ్రేణి అయిన 23 శాతం శ్లాబ్‌లో ఇప్పటివరకు 228 వస్తువు ఉండగా, ప్రస్తుతం 178 వస్తువులపై పన్ను తగ్గింది. కేవలం 50 వస్తువుకే 28% పన్ను ఉంటుంది. రెస్టారెంట్లపై పన్నును 5%కు పరిమితం చేశారు. 
28% నుంచి 18%కి తగ్గిన వస్తువుల్లో ముఖ్యమైనవి 
- చూయింగ్‌ గమ్‌ 
- చాక్‌లైట్లు 
- ఫేసియల్‌ మేకప్‌ 
- షేవింగ్‌, షేవింగ్‌ అనంతర వస్తువు 
- షాంపూలు, 
- వాషింగ్‌ పౌడర్‌ డిటర్జెంట్‌ 
- గ్రానైట్‌ 
- మార్బుల్‌ 
- వెట్‌ గ్రైండర్లు 
- కాఫీ 
- కస్టర్డ్‌ పౌడర్‌ 
- దంత ఆరోగ్య సంబంధ వస్తువు 
- పాలిష్‌లు, క్రీములు 
- రేజర్లు, బ్లేడు 
- కత్తిపీటు, వగైరా 
- స్టోరేజీ వాటర్‌ హీటర్‌ 
- బ్యాటరీలు 
- గాగుల్స్‌ 
- చేతి వాచీలు
- పరుపు 
- టేబుల్స్‌, వైర్లు 
- రబ్బరు ట్యూఋలు 
- మైక్రోస్కోపు లు
- సూట్‌కేసులు 
- విగ్గులు
28% పన్ను కొనసాగే వస్తువులు 
- పెయింట్లు 
- సిమెంట్‌ 
- వాషింగ్‌ మిషన్లు 
- ఎయిర్‌ కండిషనర్లు 
- పాన్‌ మసాలా 
- బలవర్ధక పానీయాలు 
- రిఫ్రిజిరేటర్లు 
- సిగరెట్లు, సిగార్లు 
- వ్యాక్యూం క్లీనర్లు 
- కార్లు 
- ద్విచక్ర వాహనాలు 
- విమానాలు 
- యాచ్‌ పడవు 
- పొగాకు వస్తువు 
- సువాసన ద్రవ్యాలు 
- పాత్రలు తోమే యంత్రాలు
18% నుంచి 12 శాతానికి తగ్గింపు 
- కండెన్సెడ్‌ పాలు 
- రిఫైండ్‌ చక్కెర 
- పాస్టా లి కర్రీ పేస్ట్‌ 
- మధుమేహ రోగుల ఆహారం 
- మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ 
- ప్రింటింగ్‌ ఇంక్‌ 
- హ్యాండ్‌ బ్యాగులు 
- టోపీలు 
- కళ్లద్దాల ఫ్రేములు 
- వెదురు/కేన్‌ ఫర్నిచర్‌
18% నుంచి 5 శాతానికి తగ్గింపు 
- మరమరాల ఉండు 
- బంగాళదుంపల పిండి 
- చట్నీ పొడులు 
- ఫ్లై యాష్‌ 
- ముడిచమురు శుద్ధి చేయగా మిగిలిన ఫ్లై స్ఫర్‌
12% నుంచి 5 శాతానికి.. 
- ఇడ్లీ, దోసెల రుబ్బు 
- శుద్ధి చేసిన తోలు 
- కొబ్బరి పీచు 
- కొబ్బరి పొడి 
- చేప వలు 
- ముతక వస్త్రాలు
5% నుంచి సున్నాకు తగ్గిన వస్తువులు 
- గోరుచిక్కుడు పదార్థాదాలు 
- కొన్ని రకాల ఎండు కూరగాయలు 
- కొబ్బరి డొక్కలు 
- చేపలు 
- రెస్టారెంట్లపై పన్ను భారీగా తగ్గింది. ప్రస్తుతం ఏసీ రెస్టారెంట్లపై 18 శాతం, నాన్‌-ఏసీ రెస్టారెంట్లపై 12 శాతం పన్ను ఉంది. పన్ను వాపసు వచ్చే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) విధానం కూడా అమల్లో ఉంది. ఐటీసీ వల్ల కలిగే లబ్ధిని వినియోగదారులకు బదిలీ చేయనందున రెస్టారెంట్లకు ఆ సౌకర్యాన్ని ఉపసంహరించారు. పన్ను కూడా 5 శాతానికే పరిమితం చేశారు. ఎసీ, నాన్‌ ఏసీ అన్ని రెస్టారెంట్లకూ ఇది వర్తిస్తుంది. గది అద్దె రోజులకు రూ.7,500 మించి వసూలు చేసే స్టార్‌ హోటళ్లపై 18% జీఎస్టీ వసూలు చేస్తారు. వాటికి ఐటీసీ అమవుతుంది.
- సంవిధాన పథకం (కాంపోజిట్‌ స్కీం) పరిధిని రూ.2 కోట్లకు పెంచారు. ఈ పథకం కిందకు వచ్చే డీలర్లకు అంతర్రాష్ట్ర పన్ను, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వర్తించవు.
- పన్ను రిటర్నుల దాఖలును సరళతరం చేశారు. ఆలస్యంగా దాఖలు చేసినందుకు విధించే జరిమానాను తగ్గించారు. ఆలస్యం రుసుము కింద ఇంతవరకు రూ.200 వసూలు చేసేవారు. ఇప్పుడు పన్ను భారంలేని వ్యాపారులు రూ.20, ఇతరులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. జీఎస్టీఆర్‌-3బీ రిటర్నుల దాఖలుకు మార్చి వరకు సమయం పెంచారు.

views: 894

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams