Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ కాప్‌కు వరల్డ్‌ సమ్మిట్‌ అవార్టు
హైదరాబాద్‌ నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్‌ ‘హైదరాబాద్‌ కాప్‌’కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్‌ సమ్మిట్‌ అవార్టు-2017’ను గెల్చుకుంది. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్‌ సమర్పించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 180 దేశాలు 8 కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపగా, వాటిలో భారత్‌ నుంచి హైదరాబాద్‌ కాప్‌ నామినేట్‌ అయింది. జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్‌ కాప్‌ ‘గవర్నమెంట్‌ అండ్‌ సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్‌’ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. సమాజంపై ప్రభావం చూపిన, ప్రజలకు ఉపయుక్తంగా మారిన యాప్స్‌ను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 2018 మార్చి 20-22 తేదీ మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్‌ గ్లోబల్‌ కాంగ్రెస్‌’లో సిటీ పోలీసు ఈ అవార్డును అందుకుంటారు.
views: 1252

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams