Current Affairs Telugu Daily

నెక్‌ ప్రచారకర్తగా సయాజీ షిండే
 నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) ప్రచారకర్తగా ప్రముఖ నటుడు సయాజీ షిండేను నియమించారు. ఆయన పలు భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, విలన్‌, కామెడీ పాత్రల్లో నటించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. తక్కువ ఖర్చుకు అందుబాటులో ఉన్న గుడ్డులో విటమిన్లు, మాంసకృతులు, ఖనిజ లవణాలు అధిక శాతం ఉంటాయని షిండే తెలిపారు. ఎన్‌ఈసీసీ చైరపర్సన్‌ అనురాధ దేశాయ్‌ మాట్లాడుతూ షిండే నటుడే కాకుండా ఎన్నోసేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు.
views: 1305Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams