Current Affairs Telugu Daily

బీమాకూ ఆధార్‌ తప్పనిసరి : IRDAI
బీమా పాలసీలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ IRDAI స్పష్టం చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, రెండో సవరణ -2017 ప్రకారం సాధారణ, జీవిత బీమా పాలసీలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని IRDAI తెలిపింది. ప్రస్తుత, కొత్త పాలసీలకు ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. ఆర్థిక సేవన్నింటికీ పాన్‌/ఫామ్‌ 16తో పాటు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ 2017 జూన్‌లో ప్రభుత్వం మనీ లాండరింగ్‌ నిరోధక చట్టాన్ని సవరించింది. ఈ చట్టపరమైన నిబంధనను తప్పనిసరిగా పాటించాలని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని సాధారణ, జీవితబీమా సంస్థకు IRDAI తెలిపింది. దేశంలో 24 జీవితబీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు (ఆరోగ్యబీమా సంస్థలు సహా) ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.
IRDAI- Insurance Regulatory and Development Authority of India 

views: 1070



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams