Current Affairs Telugu Daily

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా పర్యటన
అమెరికా అధ్యక్షుడు 2017 నవంబర్‌ 8 నుంచి 10 వరకు చైనాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 8న చైనా పర్యటనకు వచ్చిన ట్రంప్‌నకు బీజింగ్‌లో ఘన స్వాగతం లభించింది. భార్య మెలానియాతో కలిసి వచ్చిన అగ్రరాజ్యాధినేతకు మింట్‌ రాజవంశీకుల ప్రాచీన భవనం ఫర్‌బిడెన్‌ సిటీలో ఆతిథ్యం ఇచ్చారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చారు. ట్రంప్‌ పర్యటన తొలిరోజే అమెరికా-చైనా మధ్య సుమారు రూ.58,500 కోట్ల (900 కోట్ల డాలర్ల) విలువైన వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి.
- తన ఆరేళ్ల మనుమరాలు (ఇవాంకా, జరేద్‌ల కుమార్తె) అరబెల్లా చైనా భాష మాండరిన్‌ను నేర్చుకుంటున్న వీడియో దృశ్యాలను చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేకంగా చూపించారు. ఆమె ప్రావీణ్యాన్ని చూసి జిన్‌పింగ్‌ అరబెల్లాకు ఏం సర్టిఫికేట్‌ ఇవ్వవచ్చంటూ మెచ్చుకున్నారు.
- కాలుష్యం, మంచుతో కమ్ముకుని ఉండే బీజింగ్‌ నగరంలో డొనాల్డ్‌ ట్రంప్‌ రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాలుష్యం కట్టడికి తగిన చర్యలు చేపట్టారు. ఉక్కు, సిమెంట్‌ తదితర పరిశ్రమల్లో ఉత్పత్తిని నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడి విమానం బీజింగ్‌లో దిగే సమయానికి ఆకాశం నిర్మలంగా మారింది. వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గింది.

views: 913



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams