Current Affairs Telugu Daily

మ్యూజిక్‌ కోసం యూట్యూబ్‌..వార్తల కోసం ఫేస్‌బుక్‌ 
దేశంలోని ఇంటర్నెట్‌ వినియోగదారులు యూట్యూబ్‌ను ఎక్కువగా మ్యూజిక్‌ కోసం, ఫేస్‌బుక్‌ను వార్తల కోసం ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. విడూలీ మీడియా టెక్‌ అనే వీడియో ఇంటలిజెన్స్‌ సంస్థ దీనిపై సర్వే జరిపింది. ఆ వివరాలను సంస్థ సీఈవో సుబ్రత్‌ కర్‌ 2017 నవంబర్‌ 7న వెల్లడించారు. దాదాపు 3 బిలియన్ల మంది నెట్‌ వీక్షకులు సంగీతం కోసం యూట్యూబ్‌ను వాడుతున్నట్లు వెల్లడించింది.
- 2వ స్థానంలో దాదాపు 2.4 బిలియన్ల మంది వినోద కార్యక్రమాల కోసం యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. 
- 3వ స్థానంలో చిన్నారుల కార్యక్రమాలకు దాదాపు 1.3 బిలియన్‌ వ్యూస్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. 
- ఫేస్‌బుక్‌లో వార్తాంశాల వీడియోల తర్వాత వినోదాంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 
- సంగీతం, వినోదం, వార్తల వీడియోలను చూసే వారి సంఖ్య ఒక్కసారిగా దాదాపు 40శాతం పెరిగిపోయిందని, టయర్‌-2, 3 స్థాయి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందని వెల్లడైంది
- దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు 400 మిలియన్ల మంది ఉండగా అందులో యూట్యూబ్‌ చూసేవారి సంఖ్య అందులో ప్రధానంగా ఉంటోంది. 
- సుమారు 241 బిలియన్ల వినియోగదారులతో ఫేస్‌బుక్‌ దేశంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమంగా మారింది
- దేశంలోని 18-65 ఏళ్ల వారి 641 మిలియన్ల మంది నెట్‌ వినియోగదారుల అభిరుచులను విడూలీ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను నమోదు చేసింది.
యూట్యూబ్‌లో టాప్‌-10 ఛానల్స్‌
1.    టీ సిరీస్‌
2.    సెట్‌ ఇండియా
3    జీటీవీ
4    చుచుటీవీ
5    వేవ్‌ మ్యూజిక్‌
6    సబ్‌ టీవీ
7    జీ మ్యూజిక్‌
8    సీవీస్‌ రైమ్స్‌
9    స్పీడ్‌ రికార్డ్స్‌
10    ఈరోస్‌ నౌ 
ఫేస్‌బుక్‌లో టాప్‌-10 వార్తాల ఛానల్స్‌
1    ఏబీపీ న్యూస్‌
2    దైనిక్‌ భాస్కర్‌
3    ఆజ్‌తక్‌
4    విజయ్‌ టెలివిజన్‌
5    ఏబీపీ మజూ
6    ఏబీపీ లైవ్‌
7    హెబ్బార్స్‌ కిచెన్‌
8    ది అమిత్‌ భదానా
9    ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
10    ఆష్కీన్‌-1 

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams