Current Affairs Telugu Daily

నిమిషంలో 106 సార్లు స్కిప్పింగ్‌తో జపాన్‌ రోబో జుంపెన్‌ గిన్నిస్‌ రికార్డు
జపాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నారా కాలేజీ నిపుణులు తయారుచేసిన రోబో జుంపెన్‌ తాడాట(స్కిప్పింగ్‌)తో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 60 సెకన్లలోనే 106 సార్లు గెంతుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జపాన్‌ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న  రోబో జుంపెన్‌ ఇద్దరు వ్యక్తులు తాడును తిప్పుతుంటే గబగబా గెంతింది. ఒక్కసారి కూడా కాళ్లకు తాడు అడ్డం పడకుండా చూసుకుంది. సరిగా నిమిషం పూర్తయ్యే సరికి ఇది 106 సార్లు గెంతినట్లు గిన్నిస్‌ అధికారులు ధ్రువీకరించారు. గిన్నిస్‌ రికార్డుల్లో జపాన్‌ రోబో చోటు సంపాదించడం ఇదేమీ తొలిసారి కాదు. 2010లో ఓ యువ జంటకు పెళ్లి జరిపించి ఐ-ఫెయిరీ రోబో గిన్నిస్‌లో స్థానం దక్కించుకుంది.
views: 980

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams