Current Affairs Telugu Daily

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలకు లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు ప్రత్యేక పోర్టల్‌ 
ప్రైవేటు కార్యాలయాలు/పనిచేసే స్థలాల్లో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు తమ ఫిర్యాదును ఆన్‌లైన్‌లోనే చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను కేంద్ర మంత్రి మేనకాగాంధీ 2017 నవంబర్‌ 7న న్యూడిల్లీలో ప్రారంభించారు. కేంద్ర మహిళ,శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన వెబ్‌సైట్‌లోని ‘షి బాక్స్‌’(సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఎక్ట్రానిక్‌ బాక్స్‌) నుంచి ఫిర్యాదు పంపించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. 
- షిబాక్స్‌ ద్వారా అందే ప్రతి ఫిర్యాదును మంత్రిత్వశాఖలోని ప్రత్యేక విభాగం పరిశీలించి, సంబంధిత సంస్థలోని అంతర్గత ఫిర్యాదు కమిటీ దృష్టికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుందీ అనుశీలన జరుపుతుంది.
- కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ గతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పుడు ప్రైవేటు రంగంలోని మహిళా ఉద్యోగులకూ దీనిని విస్తరించారు. 
- కార్యాలయాలు/పని స్థలాల్లో వేధింపుల నిరోధక చట్టం-2013ను అనుసరించి 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే సంస్థల్లో లైంగిక వేధింపుల ఫిర్యాదు పరిశీలనకు అంతర్గత కమిటీ ఏర్పాటు తప్పనిసరి. నిర్ణీత సమయంలోగా ఆ కమిటీలు తమకు అందే ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

views: 1485

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams