ఇంజినీరింగ్, ఐటీ, తయారీ రంగంలో కొనసాగుతున్న సైయెంట్కు భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అవార్డు -2017 దక్కింది. ఈ అవార్డుకు ఎంపికైన 26 సంస్థల్లో సైయెంట్ ఒకటి. సీఐఐ 2014 నుంచి ఏటా వినూత్న ప్రయోగాలు, సేవలను అందిస్తోన్న సంస్థలు, స్టార్టప్లకు ఈ అవార్డును ప్రకటిస్తోంది. కంటి చికిత్సలో వీఆర్/ఏఆర్ సాంకేతికతను ఉపయోగించేందుకు వీలుగా ఎల్వీ ప్రసాద్ నేత్ర చికిత్సాలయానికి అందించిన సాంకేతికత, వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లను తయారు చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికైంది.
CII-Confederation of Indian Industry
views: 856