Current Affairs Telugu Daily

ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా డ్రోన్లతో దీవులకు సరకు చేరవేత 
చైనా ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అలీబాబా సరకుల చేరవేతలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నీటి మీదుగా వస్తువును చేరవేయడానికి తొలిసారిగా డ్రోన్లను ఉపయోగించింది. 2017 అక్టోబర్‌ 31న చైనాలోని ఫుజియాన్‌ ప్రావిన్సులోని పుటియాన్‌ నుంచి మీజౌ దీవికి మూడు డ్రోన్ల సాయంతో మొత్తంగా 12 కిలోల బరువున్న సరకులను వాయుమార్గంలో రవాణా చేసినట్లు అలీబాబా సంస్థ ప్రకటించింది. 
- బలమైన గాలులను తట్టుకుంటూ 5 కిలోమీటర్ల దూరాన్ని అవి కేవలం 9 నిమిషాల్లో ప్రయాణించాయలని అలీబాబా వెల్లడించింది. ఒక్కో డ్రోన్‌కు 7 కిలోల బరువులను మోయగలిగే సామర్థ్యం ఉందని తెలిపింది. 
- ఓ దేశీయ సాంకేతిక సంస్థతో కలిసి తమ సరకు రవాణా విభాగమే ఈ డ్రోన్లను అభివృద్ధి చేసినట్లు అలీబాబా సంస్థ వెల్లడించింది.

views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams