Current Affairs Telugu Daily

హెలికాప్టర్‌ కూలి సౌదీ యువరాజు మన్సూర్‌ మృతి
సౌదీ అరేబియా యువరాజుల్లో ఒకరైన మన్సూర్‌ బిన్‌ ముక్రిన్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. యెమెన్‌ సరిహద్దుకు 160 కిలోమీటర్ల దూరంలో.. అసిర్‌ ప్రావిన్సులోని అభా వద్ద మన్సూర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ 2017 నవంబర్‌ 5న కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో యువరాజుతో పాటు మరో ఏడుగురు మృతిచెందినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. స్థానిక ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
- యువరాజు మన్సూర్‌ ప్రస్తుతం అసిర్‌ ప్రావిన్సుకు డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 
- ఆయన తండ్రి ముక్రిన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ గతంలో సౌదీ సింహాసనాన్ని అధిష్టించే రేసులో ముందుండే ‘క్రౌన్‌ ప్రిన్స్‌’గా ఉన్నారు. 
- అయితే, అబ్దులజీజ్‌ను ఆ హోదా నుంచి ఆయన సోదరుడు రాజు సల్మాన్‌ 2015 ఏప్రిల్‌లో తొలగించి, మరో యువరాజు మహ్మద్‌ బిన్‌ నయేఫ్‌ తన తర్వాత సింహాసనాన్ని అధిష్టించేలా మార్గం సుగమం చేశాడు. 
- అనంతరం క్రౌన్‌ ప్రిన్స్‌ హోదా స్వయంగా తన కుమారుడు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు దక్కేలా నయేఫ్‌ను కూడా 2017 జూన్‌లో తప్పించారు. 
` ప్రస్తుతం క్రౌన్‌ ప్రిన్స్‌గా ఉన్న మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అవినీతి ఆరోపణలపై 11 మంది యువరాజులతో పాటు పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారు.

views: 958

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams