Current Affairs Telugu Daily

బాన్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు ప్రారంభం 
అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2017 నవంబర్‌ 6న జర్మనీలోని బాన్‌లో ప్రారంభమైంది. వాతావరణ మార్పుతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న అనేక ద్వీప దేశాల్లో ఒకటిగా ఉన్న ఫిజీ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. 12 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. వాతావరణ మార్పుపై తక్షణ చర్యలు అవసరమని ప్రారంభోత్సవ కార్యక్యక్రమంలో ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్‌ బైనిమరామా.. ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. 
views: 1025

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams