Current Affairs Telugu Daily

మాజీ ఎంపీ బీఎన్‌ రెడ్డి మృతి
బీఎన్‌ రెడ్డిగా చిరపరిచితులైన మాజీ ఎంపీ, వాస్తుశిల్పి డాక్టర్‌ బద్దం నర్సింహరెడ్డి(84) 2017 నవంబర్‌ 6న హైదరాబాద్‌లో మృతిచెందారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఆయన మిర్యాలగూడ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తొలు, ఓ కుమారుడు కాగా, రెండేళ్ల కిత్రం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్నుంచి కుంగిపోయిన బీఎన్‌, అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
- అమెరికాలో ఎంఎస్‌, ఆర్కిటెక్‌లో శిక్షణ పొందిన బీఎన్‌ రెడ్డి హైదరాబాద్‌లో జనతా గృహాలు, సినీ స్టూడియోలు, బహుళ అంతస్తు భవనాలకు రూపకల్పన చేశారు. 
- ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాల సీబీఐటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 
- 1989, 1996, 1998 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 
- 1991లో మిర్యాలగూడ లోక్‌సభ, 1999లో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

views: 1246

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams