Current Affairs Telugu Daily

రియాద్‌ పైకి క్షిపణి ప్రయోగం 
యెమన్‌ నుంచి ప్రయోగించిన ఒక బాలిస్టిక్‌ క్షిపణిని తమ రాజధాని రియాద్‌ గగనతలంలో సౌదీ అరేబియా దళాలు పేల్చివేశాయి. నగర శివార్లలోని కింగ్‌ ఖలీద్‌ విమానాశ్రయం ఎగువన ఇది జరిగింది. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. యెమన్‌లో.. ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ ముఠా హౌథీపై దాడులు చేస్తున్న సంకీర్ణ బృందంలో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ నేపథ్యంలో యెమన్‌ నుంచి అనేక క్షిపణి దాడులను సౌదీ ఎదుర్కొంటోంది. వీటిని తరచూ నేలకూలుస్తోంది.
views: 804

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams