Current Affairs Telugu Daily

భారత్‌కు మహిళ ఆసియా కప్‌ హాకీ 
భారత మహిళ హాకీ జట్టు 13 ఏళ్ల విరామం తర్వాత ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2017 నవంబర్‌ 5న జపాన్‌లోని కకామిగహరలో జరిగిన ఫైనల్లో భారత్‌ షూటౌట్లో 5-4తో చైనాపై విజయం సాధించింది. భారత్‌.. మహిళ ఆసియా కప్‌ను చేజిక్కించుకోవడం ఇది రెండోసారి. భారత్‌ ఇప్పుడు పురుషుల, మహిళల విభాగాలు రెండింటిలోనూ ఆసియా హాకీ ఛాంపియన్‌. జపాన్‌పై 1-0 విజయంతో దక్షిణ కొరియా మూడో స్థానం దక్కించుకుంది. సవితా క్రా ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా ఎంపికైంది. చివరిసారి 2004లో భారత్‌ మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలుచుకుంది. పురుషుల జట్టు 2017 అక్టోబర్‌లో ఆసియా విజేతగా నిలిచింది.
views: 987

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams