Current Affairs Telugu Daily

నిందితుల అప్పగింతపై భారత్‌ దరఖాస్తును తిరస్కరించిన బ్రిటన్‌ కోర్టు 
బ్రిటన్‌లో తలదాచుకుంటున్న నిందితులను రప్పించేందుకు.. భారత్‌ ఇటీవల చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రికెట్‌ ఫిక్సింగ్‌ కేసు నిందితుడు సంజీవ్‌కుమార్‌ చావ్లాను, 1990-93 మధ్య బ్యాంకును మోసగించిన కేసులో నిందితులైన జతిందర్‌, ఆశారాణి దంపతులను అప్పగించాలని భారత అధికారులు చేసిన దరఖాస్తును బ్రిటన్‌ కోర్టు తిరస్కరించింది. భారత్‌లో రూ.9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా అప్పగింతకు సంబంధించిన కేసులోనూ ఈ కోర్టే వాదను వింటోంది. 
views: 1031

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams