Current Affairs Telugu Daily

అవినీతి ఆరోపణలతో 11 మంది సౌదీ యువరాజుల అరెస్టు 
సౌదీ అరేబియా ఆధునిక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి ఆరోపణలపై 11 మంది యువరాజులను ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో నలుగురు మంత్రులు, డజన్లకొద్దీ మాజీ మంత్రుల, వ్యాపారవేత్తలు ఉన్నారు. పట్టాభిషిక్తుడు కానున్న యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌ అని అందరూ పిలుస్తుంటారు) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన అవినీతి నిరోధక కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకొంది. ఈ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు 2017 నవంబర్‌ 4న రాజశాసనం వెలువడగా వెంటనే కార్యాచరణ ప్రారంభమైంది. అధికారిక అల్‌ అర్బియా టెలివిజన్‌, సౌదీ ప్రెస్‌ ఏజెన్సీలు ఈ వివరాలను వెల్లడించాయి. వారెవరూ విదేశాలకు పారిపోకుండా జెడ్డాలోని ప్రైవేటు విమానాలపై ఆంక్షలు విధించారు. 2009లో జెడ్డాలో వరదలు సంభవించడం, ఇతర పాత కేసుపై ఈ కమిషన్‌ దర్యాప్తు ప్రారంభించింది.
- 32 ఏళ్ల యువరాజు ఎంబీఎస్‌ అధికారాన్ని పది పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. 
`- అందులో భాగంగానే ఒకప్పుడు సింహాసనం కోసం పోటీ పడిన సౌదీ నేషనల్‌ గార్డు అధిపతి యువరాజు మితిబ్‌ బిన్‌ అబ్దుల్లాను ప్రస్తుతం పదవి నుంచి తొలగించారు. ఆయనతో పాటుగా నౌకా దళాధిపతి, ఆర్థిక మంత్రులను కూడా తొలగించారు. 
- ప్రస్తుత సౌదీ రాజు సల్మాన్‌ వయసు 81 ఏళ్లు కావడంతో వాస్తవ అధికారాన్ని యువరాజు ఎంబీఎస్‌యే చలాయిస్తున్నారు. గత జూన్‌లో వరుసకు అన్నయ్య అయిన 58 ఏళ్ల యువరాజు మహమ్మద్‌ బిన్‌ నయఫ్‌ సింహాసనానికి పోటీ పడకుండా పక్కకు తప్పించారు. ` అరెస్టయిన యువరాజుల్లో అల్వలీద్‌ బిన్‌తలాల్‌ కూడా ఉన్నారు. ‘అరేబియన్‌ వారెన్‌ బఫెట్‌’గా గుర్తింపు పొందిన ప్రపంచంలోని ప్రముఖ ధనవంతుల్లో ఒకరు. కింగ్స్‌ హోల్డింగ్‌ కంపెనీలని నెలకొల్పారు. ఆపిట్‌, ట్విట్టర్‌సహా చాలా సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ పోటీ చేసినప్పుడు తప్పుకోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. ఒకప్పుడు ఆయనే ట్రంప్‌నకు చెందిన హోటల్‌ను కొనుగోలు చేశారు.

views: 905

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams