Current Affairs Telugu Daily

2.24 లక్షల కంపెనీల గుర్తింపు రద్దు 
రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రియాశీలకంగా లేని 2.24 లక్షల కంపెనీల పేర్లను అధికారిక గుర్తింపు జాబితా నుంచి తొలగించినట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం 56 బ్యాంకులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రాథమిక పరిశీలన ప్రకారం 35,000 కంపెనీలకు చెందిన 58,000 ఖాతా ద్వారా నోట్ల రద్దు అనంతరం రూ.17,000 కోట్లకు పైగా జమ చేసి ఉపసంహరించుకున్నట్లు గుర్తించామ’ని అధికారిక ప్రకటన వెల్లడించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు ఆర్థిక నివేదికలు సమర్పించిన కంపెనీలకు చెందిన దాదాపు 3.09 లక్షల మంది బోర్డు డైరక్టర్లను అనర్హులను చేసినట్లు కూడా పేర్కొంది.
views: 952



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams