Current Affairs Telugu Daily

‘ప్యారడైజ్‌ పత్రాల’ నల్ల జాబితాల వెల్లడి 
ప్రపంచంలోని ప్రముఖు అక్రమ ఆర్థిక లావాదేవీలు ‘ప్యారడైజ్‌ పేపర్ల’ పేరుతో బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించి 13.40 లక్ష పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. బీబీసీ పనోరమా పేరుతో దాదాపు 100 మీడియా సంస్థలు దీనిని విశ్లేషిస్తున్నాయి. పనామా పత్రాలు మాదిరిగానే జర్మనీ వార్తాపత్రిక సుడేషీ జుటంగ్‌ వీటిని సంపాదించింది. పరిశీన జరపాల్సిందిగా ‘ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు’ను కోరింది. పన్ను బెడదలేని స్వర్గధామాలుగా పేరుపొందిన దేశాల్లో ప్రముఖులు పెట్టిన పెట్టుబడుల వెల్లడయ్యాయి. ఈ కీలక పత్రాల్లో మొత్తం 180 దేశాలకు సంబంధించిన వారి వివరాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా భారతదేశం 19వ స్థానంలో నిలుస్తుంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు వేలుగులోకి వచ్చాయి.
- బ్రిటన్‌ రాణి ప్రయివేటు ఎస్టేటు తరఫున రహస్యంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆమె 10 మిలియన్‌ పౌండ్ల ప్రయివేటు ధనాన్ని విదేశాలకు పంపించారు. లాంకెస్టర్‌ రాకుమారి సాయంతో కేమ్యాన్‌ దీవుల, బెర్ముడాలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదేమీ చట్టవ్యతిరేకం కాదు. రాణీ పన్ను చెల్లించడం లేదనడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అయితే ఓ రాణి విదేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చా అన్నదే ప్రశ్నగా మారింది. ఈ విషయాలేవీ రాణికి తెలియకపోవచ్చని లాంకెస్టర్‌ రాకుమారి చెప్పారు.
- రష్యాతో సంబంధాలు ఉన్న ఓ సంస్థలో ట్రంప్‌ ప్రభుత్వం వాణిజ్య మంత్రికి వాటాలు ఉన్నాయి. 1990లో ట్రంప్‌ అప్పుల్లో కూరుకుపోయినప్పుడు విల్బర్‌ రాస్‌ అనే ప్రముఖుడు ఆదుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్‌ ఆయనను వాణిజ్య మంత్రిగా నియమించారు. రష్యా కంపెనీ తరఫున గ్యాస్‌ను సరఫరా చేసే షిప్పింగ్‌ కంపెనీలో రాస్‌కు వాటాలు ఉన్నాయి. రష్యా కంపెనీలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ అల్లుడికి వాటాలు ఉన్నాయి. ట్రంప్‌కు రష్యాతో సంబంధాలు ఉన్నాయని గతంలో ఆరోపణలు రాగా, వాటిని ఆయన తప్పుడు వార్తలు అని ఖండించారు.
- కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకి అతి సన్నిహితుడైన ఓ వ్యక్తికి విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి. లక్ష డాలర్ల పన్ను ఎగవేశారు. ఇలాంటి పన్ను ఎగవేతను అరికడతామని ఎన్నికల సందర్భంగా ట్రూడో ప్రచారం చేశారు.
- బ్రిటన్‌కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ మాజీ డిప్యూటీ ఛైర్మన్‌, ప్రముఖ దాత అయిన లార్డ్‌ ఆస్క్రోఫ్ట్‌కు కూడా విదేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి.
- ఈ సమాచారమంతా బెర్ముడాలోని న్యాయ వ్యవహారాల కంపెనీ అయిన అప్పెల్బీ నుంచి అందింది.

views: 939

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams