Current Affairs Telugu Daily

ఇమేజ్‌ సౌధానికి శంకుస్థాపన
యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో తెలంగాణను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నాలెడ్జ్‌సిటీలో రూ.946 కోట్లతో నిర్మించనున్న ఇమేజ్‌ సౌధానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ 2017 నవంబర్‌ 5న రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలుస్తున్న చార్మినార్‌ స్ఫూర్తితో ఇమేజ్‌ సౌధం నమూనాలను సిద్ధం చేశారు. ఎటు చూసినా టీ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. టీ అంటే తెలంగాణ, టీ అంటే టెక్నాలజీ.. మూడేళ్లలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. 
views: 1102Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams