Current Affairs Telugu Daily

భారత్‌-భూటాన్‌ల భద్రత పరస్పర ఆధారితం 
భారత్‌-భూటాన్‌ల భద్రతా సమస్యలు విడదీయరానివి, పరస్పరం ముడిపడి ఉన్నవని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. భూటాన్‌ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి భారత్‌ సహకరిస్తుందని తెలిపారు. దేశంలో పర్యటిస్తున్న భూటాన్‌ రాజు జిగ్మే ఖెసర్‌ నామ్‌గ్యెల్‌ వాంగ్‌చుక్‌తో 3 నవంబర్ ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ తన అనుభవాన్ని, విజ్ఞానాన్ని, వనరులను అందజేస్తుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో సకాలంలో జలవిద్యుత్తు ప్రాజెక్టులను అమలు చేయడం రెండు దేశాలకూ చాలా ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదే కీలక అంశమని చెప్పారు. పొరుగుదేశాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాల కారణంగా రెండుదేశాలు సహజ మిత్రులు, భాగస్వాములుగా ఎదుగుతున్నాయని చెప్పారు. తాను ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో అభినందిస్తూ లేఖ రాసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక సంస్కృతి, పర్యావరణాన్ని కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని భూటాన్‌ రాజును ప్రశంసించారు. రాజవంశం దూరదృష్టి కారణంగానే రెండు దేశాల మధ్యసంబంధాలు మరింతగాబలపడుతున్నాయని అన్నారు.
రక్షణ మంత్రి భేటీ: భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌తో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. యువరాజుకు కర్ణాటకలోని చెన్నపట్నకు చెందిన బొమ్మలను బహూకరించారు.

views: 932

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams