Current Affairs Telugu Daily

దివ్యాంగులైన పిల్లలకిచ్చే విద్యాభత్యం పెంపు
కేంద్ర ప్రభుత్వోద్యోగుల పిల్లల్లో దివ్యాంగులైన వారి కోసం అందజేస్తున్న వార్షిక విద్యాభత్యాన్ని (సీఈఏ) ప్రభుత్వం తాజాగా రూ. 54 వేలకు పెంచింది. దివ్యాంగులైన పిల్లల చదువులకు గాను ఉద్యోగులు వెచ్చించే మొత్తాన్ని ప్రస్తుతం నెలకు రూ. 2,250 వరకు పరిమితితో లెక్కించి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది (రీయంబర్స్‌మెంట్‌). కాగా ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసినట్లు సిబ్బంది-శిక్షణ వ్యవహారాల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
views: 858

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams