Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ మెట్రోకు అత్యుత్తమ పురస్కారం 
ప్రారంభానికి సన్నద్ధమవుతున్న హైదరాబాద్‌ మెట్రోరైలుకు మరో పురస్కారం దక్కింది. 2017 సంవత్సరానికి రాబోయే అత్యుత్తమ మెట్రోప్రాజెక్ట్‌గా కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా ఎంపిక చేసింది. దేశంలో అత్యుత్తమ నిర్మాణ, మౌలికరంగ ప్రాజెక్ట్‌లను గుర్తించి కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా ఏటా పురస్కారాలను అందజేస్తుంది. ఏడేళ్లలో ఈ అవార్డును ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘బెస్ట్‌ అప్‌కమింగ్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ద ఈయర్‌’ అవార్డును ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎంపీ నాయుడు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎన్నో మెట్రోలు వస్తున్నా ఆకృతి, రూపకల్పన, అమలుపరంగా హైదరాబాద్‌ మెట్రో అన్నింటి కంటే మిన్నగా ఉందని చెప్పారు. పురస్కారం రావడంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ శివానంద్‌ నింబర్గి స్పందిస్తూ..మెట్రో ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌ ప్రజలపై మా నిబద్ధతను ఈ పురస్కారాలు తెలియజెప్పుతున్నాయన్నారు.
views: 1446

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams