Current Affairs Telugu Daily

స్థానికత మరో రెండేళ్లు పెంపు 
 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఉన్న గడువును మరో రెండేళ్లు పెంచడానికి రాష్ట్రపతి ఆమోదముద్రవేశారు. తొలుత ఈ ఏడాది జూన్‌ 2 వరకు ఈ గడువు విధించారు. రాష్ట్ర పరిపాలన యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడిప్పుడే మారడం, చాలా కార్యాలయాల విభజన జరగాల్సిన ఉన్నందున గడువును మరో రెండేళ్లపాటు పెంచాలని రాష్ట్రం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. స్పందించిన హోంశాఖ సంబంధిత దస్త్రాన్నిఆమోదించి ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి పంపింది. అక్కడా ఆమోదముద్ర వేయడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371డిలోని క్లాజ్‌1, 2 కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌) ఆర్డర్‌ 1974లోని పేరా 4, సబ్‌పేరాగ్రాఫ్‌ 3లో ఉన్న ‘మూడేళ్లలోపు’ అన్న పదాన్ని ‘అయిదేళ్లలోపు’గా మార్చడానికి ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం 2014 జూన్‌ 2 తర్వాత అయిదేళ్లలోపు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలసవచ్చిన వారందర్నీ, అక్కడ నివాసితులతో సమానంగా స్థానికులుగా పరిగణిస్తారు. 
views: 1308

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams