Current Affairs Telugu Daily

చైనాలో తొలి హైడ్రోజన్‌ ట్రామ్‌ ప్రారంభం
ప్రజా రవాణా వ్యవస్థలో చైనా మరో ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి పర్యావరణహితమైన ట్రామ్‌ను 2017 అక్టోబర్‌ 27న ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలి పర్యావరణహిత హైడ్రోజన్‌ ట్రామ్‌గా ఇది రికార్డుల్లోకెక్కనుంది. ఈ ట్రామ్‌ ద్వారా తొలిసారిగా నార్త్‌ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని తంగ్షన్‌లో కమర్షియల్‌ సర్వీసును అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ఈ ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న  ఈ ట్రామ్‌ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
views: 1358



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams