Current Affairs Telugu Daily

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నలుగురు తెలంగాణ విద్యార్థులు
తెలంగాణ మైనార్టీ గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. 2017 అక్టోబర్‌ 20 నుంచి 25వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు. సంగారెడ్డి, వరంగల్‌ గురుకుల బాలుర పాఠశాలల విద్యార్థులు డి.భాస్కర్‌, ఎస్‌.కె.ఫెరోజ్‌,.. బోధన్‌, గజ్వేల్‌ బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థినులు సిద్రా తుల్‌ ముంతాహ, బి.రాణి పర్వతాన్ని అధిరోహించిన బృందంలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం కుర్వగూడ గ్రామానికి చెందిన దాదె సునీల్‌ 2017 అక్టోబర్‌ 19న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఏడుగురు బృందంతో వెళ్లి అక్టోబర్‌ 27న పర్వత శిఖరాన్ని చేరాడు. ఈ సందర్భంగా జాతీయ పతాకంతో పాటు..ప్రధాని మోడి చిత్రాన్ని ప్రదర్శించాడు. 
- ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన పదేళ్ల చిన్నారి కామ్యా కార్తికేయన్‌ ఆఫ్రికాలోనే అతిఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. సాహస్‌ పేరిట నిర్వహించిన యాత్రలో భాగంగా ఆమె ఆ పర్వతాగ్రానికి చేరుకుంది.

views: 2196



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams