Current Affairs Telugu Daily

తెలుగు రాష్ట్రాల్లో 31% మంది ‘జన్‌ధన్‌’ తెరిస్తే ప్రభుత్వం డబ్బులేస్తుందనుకున్నారు : ప్రపంచబ్యాంకు 
జన్‌ధన్‌ ఖాతా తెరిస్తే అవోకగా ఖాతాల్లో నగదు బోనస్‌ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్‌(31%), బిహార్‌(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్‌ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో ప్రపంచబ్యాంకు బృందం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో 12వేల మందిని సర్వే చేసింది. పథకం అమలు, దానిపై ప్రజలకున్న అంచనాలపై వివరాలు రాబట్టింది. 
- కొందరు ఖాతా తెరిచిన వెంటనే బోనస్‌ పడుతుందని భావిస్తే, మరికొందరు దీనిద్వారా లభించే ఓవర్‌డ్రాఫ్ట్‌ను వెనక్కు ఇవ్వనవసరంలేదని భావించారు. 
- ఇంకొందరు విదేశాల నుంచి వెలికితీసే నల్లధనాన్ని ప్రభుత్వం తమ ఖాతాల్లో వేస్తుందని ఆశించారు. ఇలాంటి అంచనాలతోనే చాలామంది ఖాతాలు తెరిచినట్లు ఈ అధ్యయనంలో తేలింది. 
- ఖాతాదారులకు రూ.5వేల ఓవర్‌డ్రాఫ్ట్‌(ఓడీ) ఇస్తారన్న ఉద్దేశంతోనే ఖాతా తెరిచినట్లు మహారాష్ట్రలో 25% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 
ఈ అభిప్రాయం ప్రబలడంతో కొన్ని బ్యాంకులు ఓడీ పరిధిని తగ్గించినట్లు అధ్యయన బృందం పేర్కొంది. 
- ఇంకొందరు ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల కింద సబ్సిడీ మొత్తాలను వేసినట్లుగానే ఓవర్‌డ్రాఫ్ట్‌ మొత్తాన్ని కూడా వేస్తారని వూహించారు. 
- రాజస్థాన్‌, హర్యానా, బిహార్‌ల్లో అనేకమంది తమ ఖాతాల్లోకి ప్రభుత్వం విదేశాల నుంచి వెలికితీసే నల్లధనాన్ని వేస్తుందని ఆశించారు. ఇలా వూహించిన మొత్తం రూ.5వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉన్నట్లు సర్వేలో తేలింది. 
- జన్‌ధన్‌ యోజన గురించి విస్తృతస్థాయిలో తప్పుడు అంచనాలు ప్రబలినట్లు ప్రపంచబ్యాంకు బృందం వెల్లడించింది. 
- ఏదో ఆశించి ఖాతాలు తెరవడంవల్ల ఎక్కువమంది వాటిని వినియోగించకుండా వదిలేసే ప్రమాదం ఉందని, దీనివల్ల ఆర్థిక సమ్మిళితం కింద ప్రభుత్వం అందించే ప్రయోజనాలను లబ్ధిదారులు పొందకుండా పోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
- అందువల్ల జన్‌ధన్‌ యోజన ఉద్దేశా గురించి స్పష్టమైన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉన్నట్లు పేర్కొంది.

views: 1076

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams