Current Affairs Telugu Daily

కొండకల్‌లో రైల్వే, మెట్రో కోచ్‌ల పరిశ్రమ 
తెలంగాణలోని రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లా సరిహద్దులో కొండకల్‌ గ్రామంలో  రైల్వే, మెట్రో కోచ్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రూ.800 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పి 2000 మందికి ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో 2017 అక్టోబర్‌ 27న హైదరాబాద్‌లో ఈ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 
views: 1385

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams