Current Affairs Telugu Daily

ఒడిశా అవిభక్త కవలలను వేరుచేసిన ఎయిమ్స్‌ బృందం 
భారత్‌లోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను డిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) 2017 అక్టోబర్‌ 26న పూర్తి చేసింది. ఒడిశాకు చెందిన 28 నెలల వయసున్న అవిభక్త కవలలు జగ, కాలియాలకు నిపుణుల బృందం 16 గంట పాటు శస్త్రచికిత్స నిర్వహించి వేరుచేసింది. 
- తెలంగాణలో వీణ-వాణిలు అవిభక్త కవలలుగా ఉన్నారు. వీరు వరంగల్‌ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003లో తలలు అతుక్కున్న స్థితిలో వీణా వాణిలు జన్మించారు. వారిని శస్త్రచికిత్స ద్వారా వేరు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా అవేవీ సఫలం కాలేదు. 14 ఏళ్ల వయసున్న వీణావాణిలు ప్రస్తుతం హైదరాబాద్‌లో అమీర్‌పేటలోని స్టేట్‌హోంలో ఉంటున్నారు.

views: 1122

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams