ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 2016లో గణనీయంగా పెరిగింది. 2015లో కన్నా ఈ సంఖ్య 10 శాతం మేర అధికమైనట్లు స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్, ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యుసీ వెల్లడించాయి. కొత్తగా బిలియనీర్లు అయిన వారిలో ఆసియా ఖండం అగ్రభాగంలో ఉండగా, అందులోనూ చైనా, భారత్లు ముందు వరుసలో నిలిచాయని యూబీఎస్, పీడబ్ల్యుసీ తమ వార్షిక అధ్యయన నివేదికలో పేర్కొన్నాయి. బిలియనీర్ల సంఖ్యలో తొలిసారిగా అమెరికా (563 మంది)ను ఆసియా ఖండం(637 మంది) అధిగమించింది.
views: 965