Current Affairs Telugu Daily

భారత్‌లో తొలిసారిగా కచ్‌లో ‘రాకాసి మత్స్య బల్లి’ శిలాజం 
భారత్‌లో తొలిసారిగా భారీ రాకాసి మత్స్య బల్లి శిలాజం వెలుగుచూసింది. భయంకరమైన ఆకారంతో కనిపించే ఈ సముద్రపు జీవులు రాక్షసబల్లుల కాలం నాటివి. 25 కోట్ల ఏళ్ల క్రితం ఇవి రాక్షసబల్లులతోపాటు ఆధిపత్యాన్ని చెలాయించాయి. వీటి శిలాజాలు ఉత్తర అమెరికా, ఐరోపా తీరాల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అయితే మన దేశంలో దీని శిలాజం వెలుగుచూడటం ఇదే ప్రథమం. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో డిల్లీ వర్సిటీ, జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎర్లాంగెన్‌ న్యూరెంబర్గ్‌ నిపుణులు దీన్ని గుర్తించారు. దీని అస్థిపంజరం పొడవు 5.5 మీటర్ల వరకూ ఉంది. ఇది 16.5 నుంచి 9 కోట్ల ఏళ్ల క్రితం జీవించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీని శిలాజం పక్కనే శంఖు చేపల్లాంటి జీవుల శిలాజాలు ఉన్నాయి. ఈ మత్స్య బల్లి పళ్లు చూస్తుంటే.. ఇది భారీ జీవులను వేటాడినట్టు కనిపిస్తోందని డిల్లీ వర్సిటీ నిపుణులు వెల్లడించారు. 
views: 1079

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams