Current Affairs Telugu Daily

స్టాంపు కాగితాల దోషి తెలగీ మృతి 
జైలుశిక్ష అనుభవిస్తున్న నకిలీ స్టాంపు కాగితాల నేరగాడు అబ్దుల్‌ కరీం లాలా తెలగి(56) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో 2017 అక్టోబర్‌ 26న మృతి చెందాడు. ఆరోగ్యరీత్యా పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక అతిథి సౌకర్యాలతో గడిపిన తెలగి మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ సమస్య, ఎయిడ్స్‌తోపాటు పలు వ్యాధులతో బాధపడ్డాడు. నకిలీ స్టాంపు కాగితాలను ముద్రించిన నేరానికి న్యాయస్థానం ఆయనకు 2006లో 30 ఏళ్ల జైలుశిక్ష, రూ.202 కోట్ల జరిమానా విధించింది. నకిలీ స్టాంపు కాగితాలను విక్రయించి రూ.కొన్ని వేల కోట్ల అక్రమార్జన చేసిన ఆయనను బెంగళూరు పోలీసులు 2001 నవంబరులో అజ్మీర్‌లో అరెస్టు చేశారు. తన ప్రతినిధుల ద్వారా నకిలీ స్టాంపు కాగితాల్ని బ్యాంకులు, బీమా సంస్థలు, బ్రోకరేజ్‌ సంస్థలకు విక్రయించాడు. మహారాష్ట్రకు సరిహద్దులోని బెళగావి జిల్లా తెలగి గ్రామంలో కరీంలాలా జన్మించాడు. 
views: 1014

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams