Current Affairs Telugu Daily

థాయ్‌ రాజు భూమిబొల్‌ అదుల్యదేజ్‌కు కన్నీటి వీడ్కోలు 
థాయ్‌లాండ్‌ ప్రజలు ‘తండ్రి’ అని పిలుచుకొనే ఆ దేశం రాజు భూమిబొల్‌ అదుల్యదేజ్‌కు 2017 అక్టోబర్‌ 26న శాశ్వత వీడ్కోలు పలికారు. 88 ఏళ్ల వయసులో ఆయన 2016 అక్టోబరు 13న మృతి చెందారు. దేశ ప్రజలు ఏడాది పాటు సంతాప దినాలు పాటించారు. 5 రోజుల పాటు అంత్యక్రియలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు 2017 అక్టోబర్‌ 25న ప్రారంభమయ్యాయి. 2017 అక్టోబర్‌ 26న పార్ధివ దేహం వూరేగింపు జరిగింది. బంగారు సింహాసనం ఉన్న దుసిత్‌ మహా ప్రసాద్‌ దర్బారు హాలు నుంచి బంగారు శ్మశానం వరకు వూరేగింపు జరిగింది. బంగారు పల్లకి, రథం వంటి రాజలాంఛనాలతో వూరేగింపు జరిగింది సుమారు రెండు కిలోమీటర్ల మేర జరిగిన వూరేగింపులో దేశం నుమూలలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతిక కాయాన్ని బౌద్ధ మత ఆచారాల ప్రకారం పెద్ద కలశంలో ఉంచడం ఆనవాయితీ కాగా, ఆయన కోరిక మేరకు శవపేటికలో ఉంచారు. అయితే సంప్రదాయం ప్రకారం కలశాన్ని వూరేగించారు. పక్కనే శవపేటికను పెట్టారు. దేవతలు నివసించే మేరు పర్వతానికి ప్రతీకగా నిర్మించిన బంగారు కట్టడంపైకి భౌతిక కాయానికి తీసుకెళ్లారు.
views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams