Current Affairs Telugu Daily

బ్లాక్‌ డీల్‌ నిబంధనల సవరణ : SEBI
బ్లాక్‌ డీల్స్‌కు సంబంధించిన నిబంధనను మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ SEBI సవరించింది. 15 నిమిషాల చొప్పున పనిచేసే రెండు ప్రత్యేక ట్రేడింగ్‌ గవాక్షాలను ఏర్పాటు చేయడంతో పాటుబీ కనీస ఆర్డరును రూ.10 కోట్లకు పెంచింది. భారీ స్థాయి క్రయవిక్రయాలపై విశ్వసనీయత పెంచడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌ డీల్‌ గవాక్షం అంటే.. పెద్ద సంఖ్యలో షేర్ల లావాదేవీలను జరపడానికి కొనుగోలుదార్లు, విక్రేతలకు ప్రత్యేకంగా ఎక్స్చేంజీలు ఏర్పాటు చేసే సదుపాయం. దీని ద్వారా లావాదేవీలకు ముందే కొనుగోలుదార్లు, విక్రేతల మధ్య చర్చలు జరిగి.. ఒక ఒప్పందానికి వస్తారు. 
- కొత్త నిబంధనల ప్రకారం.. ఉదయం, మధ్యాహ్నం 15 నిమిషాల వ్యవధిలో బ్లాక్‌ డీల్‌ గవాక్షాలను నిర్వహించుకోవచ్చు. 
- ఉదయం ట్రేడింగ్‌ 8:45 నుంచి 9:00 వరకు, మధ్యాహ్నం గవాక్షం 2:05 నుంచి 2:20 వరకు తెరచి ఉంచుతారు. ప్రస్తుతం బ్లాక్‌ డీల్స్‌ కోసం ఉదయం 9:15 నుంచి 9:50 మధ్య 35 నిమిషాల పాటు ట్రేడింగ్‌కు అనుమతినిస్తున్నారు. 
- అదే సమయంలో కనీస లావాదేవీల పరిమాణాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచింది.
- SEBII ఛైర్మన్‌ : అజయ్‌ త్యాగి
SEBII-Securities and Exchange Board of India

views: 1029



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams