Current Affairs Telugu Daily

ఆధార్‌ లేదని రేషన్‌ సరకులు నిరాకరించొద్దు : కేంద్రం
ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందజేసే రేషన్‌ సరకులను ఆధార్‌ లేదని, రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం కాలేదని తదితర  కారణాలతోనో నిరాకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. అవే సాకులతో అర్హులైన వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించరాదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. జార్ఖండ్‌లో రేషన్‌ సరకులివ్వక పోవటంతో ఓ కుటుంబలోని 11 ఏళ్ల బాలిక ఆకలికి తట్టుకోలేక మృత్యువాత పడిన నేపథ్యంలో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. అర్హతపై సరైన పరిశీన జరగాలని, అనర్హుడని కచ్చితంగా నిర్ధరణ చేసుకున్న తర్వాతే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆధార్‌ నమోదుకు, ఆధార్‌ అనుసంధానానికి సరైన ఏర్పాట్లు చేయాలని ఆహారమంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధన ఉల్లంఘనకు పాల్పడే వారిపై గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికి కూడా రేషన్‌ సరకును ఇవ్వటానికి నిరాకరించరాదనే ఉద్దేశంతోనే ఈ సూచను చేస్తున్నట్లు విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు.
UIDAI -Unique I dentification Authority of India

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams