Current Affairs Telugu Daily

చంద్రబాబునాయుడుకు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్‌ పీకాక్‌’ లీడర్‌షిప్‌ అవార్డు అందుకున్నారు. 2017 అక్టోబర్‌ 25న లండన్‌లో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ‘పబ్లిక్‌ సర్వీస్‌, ఎకనమిక్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ విభాగంలో చంద్రబాబుకి అవార్డు అందచేశారు. బ్రిటన్‌ మంత్రి ప్రీతి పటేల్‌ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. చంద్రబాబునాయుడు సతీమణి, హెరిటేజ్‌ సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ నారా భువనేశ్వరికి అదే వేదికపై ‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌’ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి గురించి నిర్వాహకుల సభికులకు పరిచయం చేస్తూ భారతదేశ ప్రధాని పదవి చేపట్టేందుకు చంద్రబాబుకు అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడారు. అవార్డు అందుకున్న తర్వాత చంద్రబాబు ఆహూతులను ఉద్దేశించి మాట్లాడుతూ... తాను ప్రధాని పదవిని ఆశించడం లేదని, ఆ పదవికి పోటీదారులని కాదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. 
views: 1104

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams