Current Affairs Telugu Daily

2016లో హరించుకుపోయిన 7.34 కోట్ల ఎకరాల వృక్షసంపద
2016లో ప్రపంచవ్యాప్తంగా 7.34 కోట్ల ఎకరాల మేర అటవీ సంపద హరించుకుపోయిందని.. విస్తీర్ణంలో ఇది న్యూజిలాండ్‌ దేశానికి సమానమని మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ నివేదిక వెల్లడించింది. కార్చిచ్చుల సంఖ్య పెరగడం తీవ్ర నష్టానికి దారితీసిందని.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 51% ఎక్కువ వృక్షసంపద నాశనమైందని నివేదిక వెల్లడించింది. కార్చిచ్చుల ముప్పు సహజసిద్ధంగా తక్కువగా ఉండే ఉషష్ట్రూమండల ప్రాంతాల్లోనూ.. నిర్వహణ లోపాలు, శక్తిమంతమైన ఎల్‌నినో కారణంగా నష్టం పెరిగిందని తెలిపింది. బ్రెజిల్‌, ఇండోనేసియాల్లో కార్చిచ్చులు ప్రాణాలను కూడా బలి తీసుకున్నాయని పేర్కొంది. 2017లో  పోర్చుగల్‌, అమెరికాలోని కాలిఫోర్నియాల్లోనూ మరణాలు సంభవించాయని తెలిపింది. 2016లో బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీప్రాంతంలోని 91 లక్షల ఎకరాల వృక్షసంపద నాశనమైందని.. పోర్చుగల్‌ దేశ అటవీసంపదలో 4% అగ్నికి ఆహుతయిందని తెలిపింది.
views: 952

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams