Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్‌ సుడిగాలి పర్యటన
అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్‌ 2017 అక్టోబర్‌ 24న పాకిస్థాన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసీ సహా పలువురు నేతతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్‌ మరింత కృషి చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంపిన సందేశాన్నిటిల్లర్సన్‌ పునరుద్ఘాటించారు. ఉగ్రసంస్థకు పాక్‌ సురక్షిత స్థావరంగా నిలుస్తోందంటూ ట్రంప్‌ గత ఆగస్టులో వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా, పాక్‌ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకే టిల్లర్సన్‌ తాజా పర్యటన చేపట్టినట్లు తొలుస్తోంది.
views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams