జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో పెట్‌కోక్ (కర్బన పదార్థం), ఫర్నేస్ ఆయిల్‌ను వాడే పరిశ్రమలకు కాలుష్య ఉద్గారాల ప్రమాణాలను ఖరారు చేయనందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖపై సుప్రీంకోర్టు 2017 అక్టోబర్ 24న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖకు రూ.2 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని పరిశ్రమల్లో పెట్‌కోక్, ఫర్నేస్ ఆయిల్ వాడకాన్ని నిలిపివేయాంటూ ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని వినియోగించకుండా నిషేధించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పెట్‌కోక్, ఫర్నేస్ ఆయిల్ వాడకాన్ని నిషేధించడంలో ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమైతే మాత్రం తామే నిషేధం విధించక తప్పదని కూడా స్పష్టం చేసింది.
views: 980