Current Affairs Telugu Daily

ఐఎస్‌ అకృత్యాలపై సమష్టి పోరు : ASEAN
ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) తీవ్రవాద అనుకూల శక్తును సమర్ధంగా నిరోధించేందుకు కలిసికట్టుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనీ...పోరాడాలనీ దక్షిణాసియా దేశాల సంఘం(ASEAN) సంకల్పించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఏసియన్‌ దేశాల రక్షణ మంత్రుల సమావేశం ముగింపు సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుద చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ...సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రవాదం వ్యాప్తి అనేది సభ్య దేశాలన్నిటికీ ఓ పెను భద్రతా సవాలుగా తయారైందన్నారు. ఈ పోకడను సమర్ధంగా ఎదుర్కొనేందుకు శక్తిమంతమైన సమష్టి చర్యలు తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. 
ASEAN-Association of Southeast Asian Nations

views: 949



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams