Current Affairs Telugu Daily

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ భారత పర్యటన
అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ 2017 అక్టోబర్‌ 24న భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డిల్లీలోని ‘వివేకానంద అంతర్జాతీయ ఫౌండేషన్‌’ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడి, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఘనీ ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ మద్దతునిస్తుండడంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై ఆ దేశం ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ఉగ్రవాదానికి వూతమివ్వడాన్ని మానుకోకపోతే పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరచాని చూస్తున్న ఉగ్రవాద స్థావరాలకు పాక్‌ మద్దతునిస్తోందన్నారు. పాకిస్థాన్‌ మీదుగా భారత్‌తో వాణిజ్యం చేసేందుకు తమను అనుమతించకపోతే- మధ్య ఆసియా ప్రాంతాన్ని చేరుకునేందుకు పాక్‌కు మార్గం లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాక్‌ స్పందన ఆధారంగా తమ ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు.
views: 945



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams