Current Affairs Telugu Daily

రూ.32.50 లక్షల కోట్లతో సౌదీలో భారీ నగరం నియోమ్‌ 
సుమారు 500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.32.50 లక్షల కోట్లు) పెట్టుబడుతో నియోమ్‌ పేరుతో సరికొత్త, అధునాతన, భారీ నగరాన్ని ఎర్ర సముద్ర తీరంలో నిర్మించనున్నట్లు సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. ఈ నిధుల్ని ప్రభుత్వం నుంచి, స్థానిక/ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సమీకరిస్తామని తెలిపారు. 2017 అక్టోబర్‌ 24న రియాద్‌లో ప్రపంచ వాణిజ్య సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్త నగరానికి సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. 
- ఎర్ర సముద్రంపై వంతెన నిర్మించి, జోర్డాన్‌, ఈజిప్టుతో అనుసంధానం చేయడం ద్వారా ఈ నగరం మూడు దేశాలకు విస్తరించిన ప్రపంచ ప్రప్రథమ స్వతంత్ర ఆర్థిక మండలిగా నిలిచిపోయేలా చేయనున్నారు. ప్రపంచ వాణిజ్యంలో పదోవంతు ఇక్కడి నుంచే జరుగుతుంది.
- యువరాజు సల్మాన్‌ తన సామాజిక సంస్కరణల్ని సమర్థించుకున్నారు. మహిళలు వాహనాల్ని నడపడంపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడాన్ని ప్రస్తావిస్తూ తాము గతంలో ఇలా ఉండేవాళ్లం కాదన్నారు. మళ్లీ మితవాద ఇస్లాంకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

views: 920

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams