Current Affairs Telugu Daily

ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల విభజన 
రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులతో పాటు కేటాయింపులను కేంద్రం ఖరారు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకు మొత్తం 61 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 46 శాశ్వత న్యాయమూర్తుల పోస్టులు, 15 అదనపు న్యాయమూర్తుల పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులను జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణాకు కేటాయింపు జరిగింది. కాగా న్యాయవ్యవస్థలో న్యాయాధికారులు, న్యాయమూర్తుల విభజనలో 60:40 నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు కేటాయింపులు జరిగాయి. ఈ ప్రాతిపదికన ప్రస్తుతం హైకోర్టుకు న్యాయమూర్తుల విభజన జరిగింది. విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 37 పోస్టులు మంజూరు కాగా అందులో 28 శాశ్వత న్యాయమూర్తుల పోస్టులు, 9 అదనపు న్యాయమూర్తుల పోస్టులున్నాయి. అదే విధంగా తెలంగాణకు 24 పోస్టు కేటాయింపు జరగగా అందులో 18 శాశ్వత న్యాయమూర్తుల పోస్టులు, 6 అదనపు న్యాయమూర్తుల పోస్టులున్నాయి. ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తుల్లో ఇద్దరు బయటి రాష్ట్రాలకు చెందినవారు కాగా 17 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 12 మందిని తెలంగాణకు కేటాయించారు. రాష్ట్ర విభజన అనంతరం న్యాయమూర్తుల విభజనకు కేంద్ర న్యాయశాఖ న్యాయమూర్తుల నుంచి ఐచ్ఛికాలను కోరగా వారు సమర్పించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది న్యాయమూర్తుల తెలంగాణలోనే ఉండాలనికి ఆసక్తి చూపుతూ ఐచ్ఛికాలను అందజేశారు. న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాలను సుప్రీంకోర్టు కొలీజియం యథాతథంగా ఆమోదించడంతో కేంద్రం ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇటీవల కేంద్ర న్యాయశాఖ హైకోర్టుకు పంపింది. కాగా రెండు రాష్ట్రాలకు న్యాయమూర్తుల కేటాయింపు పూర్తయినప్పటికీ హైకోర్టు విభజన జరగనందున ఇప్పటి మాదిరిగానే ఉభయ రాష్ట్రాల కేసులను అందరు న్యాయమూర్తుల విచారణ జరుపుతారు. హైకోర్టు విభజన పూర్తయ్యాకే న్యాయమూర్తుల విభజన అమలులోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవారు 
1. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ (తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి) 2. జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ 3. జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ 4. జస్టిస్‌ ఎ.వి.శేషసాయి 5. జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు 6. జస్టిస్‌ డి.శేషాద్రినాయుడు (ప్రస్తుతం కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు) 7. జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి 8. జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌రావు 9. జస్టిస్‌ టి.సునీల్‌ చౌదరి 10. జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి 11. జస్టిస్‌ ఎ.శంకర నారాయణ 12. జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ 13. జస్టిస్‌ జె.ఉమాదేవి 14. జస్టిస్‌ ఎన్‌.బాయోగి 15. జస్టిస్‌ టి.రజని 16. జస్టిస్‌ డీవిఎస్‌ఎస్‌ సోమయాజు 17. జస్టిస్‌ కె.విజయలక్ష్మి 18. జస్టిస్‌ ఎం.గంగారావు
తెలంగాణకు కేటాయించినవారు 
1. జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి (ప్రస్తుతం గుజరాత్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు) 2. జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి 3. జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు (ఆగస్టులో పదవీ విరమణ చేశారు) 4. జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ 5. జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు 6. జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి 7. జస్టిస్‌ పి.నవీన్‌రావు 8. జస్టిస్‌ చల్లా కోదండరాం 9. జస్టిస్‌ బి.శివశంకరరావు 10. జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌ 11. జస్టిస్‌ అనీస్‌ (ఇటీవ పదవీ విరమణ చేశారు) 12. జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ 13. జస్టిస్‌ పి.కేశవరావు 14. జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి 15. జస్టిస్‌ డి.అమరనాథ్‌ గౌడ్‌

views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams