Current Affairs Telugu Daily

చైనా అధ్యక్షుడిగా మరోసారి జి జిన్‌పింగ్‌ 
చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ తమ దేశ ప్రస్తుత అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను మరో 5 సం॥ల పాటు అదే పదవిలో కొనసాగించేందుకు నిర్ణయించటంతో పాటు ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించింది. పార్టీ వ్యవస్థాపకుడు, ఆధునిక చైనా రూపకర్త మావో జెడాంగ్‌తో సమానమైన హోదాను కల్పించింది. 
- పార్టీ రాజ్యాంగంలో ఇప్పటి వరకూ మావో, ఆయన తర్వాత అధికారాన్ని చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ పేర్లు, సిద్ధాంతాలు, ఆలోచనలనే చేర్చారు. డెంగ్‌ ఆలోచనలకు ఆయన మరణం తర్వాతే పార్టీ రాజ్యాంగంలో చోటుదక్కింది. 
- ఇప్పుడు మావోతో సమాన హోదాను కల్పించేలా షి జిన్‌పింగ్‌ పేరును, ఆయన ఆలోచనలను పార్టీ రాజ్యాంగంలో చేర్చాలని పార్టీ 19వ జాతీయ మహాసభ నిర్ణయించింది. 
- వారం రోజుల పాటు కొనసాగిన మహాసభ 2017 అక్టోబర్‌ 24న ముగిసింది. 
- ‘చైనా ప్రత్యేకతలతో నూతన యుగ సామ్యవాదం’ అన్న షి జిన్‌పింగ్‌ భావనను రాజ్యాంగంలో చేర్చేందుకు అవసరమైన సవరణలకు మహాసభ ఆమోదం తెలిపింది. 
- షి జిన్‌పింగ్‌కు ముందు అధ్యక్షులుగా ఉన్న జియాంగ్‌ జెమిన్‌, హు జింటావోల ఆలోచనలకు పార్టీ రాజ్యాంగంలో చోటు దక్కినా వారి పేర్లను మాత్రం చేర్చలేదు. 
- చైనా వ్యాప్తంగా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో షి ఆలోచనా విధానాలను పాఠ్యాంశాలుగా చేర్చే అవకాశం ఉంది. 
- సంక్లిష్టమైన మార్క్సిజాన్ని చైనా ప్రత్యేక పరిస్థితులకు అన్వయించి మార్క్సిస్ట్‌ మేధావిగా మావో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయనతో సమానంగా షి జిన్‌పింగ్‌ను పార్టీ రాజ్యాంగంలో చేర్చటం జరిగింది. 
ప్రధానిగా మరో అయిదేళ్లు లి కెఖియాంగ్‌
- చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో 2300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు ప్రస్తుత ప్రధానమంత్రి లి కెఖియాంగ్‌(62)ను కూడా మరో అయిదేళ్ల కాలానికి అవే పదవులకు ఎన్నుకున్నారు. హోదాల పరంగా ప్రభుత్వంలో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉంటారు. నూతన కేంద్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది.
భారత్‌తో చర్చలు జరిపిన అధికారికి పదోన్నతి 
- చైనా-భారత్‌ సరిహద్దు చర్చలతో పాటు డోక్లాం ప్రతిష్టంభన సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ హాజరైన సమావేశంలో పాల్గొన్న ఆ దేశ ఉన్నతస్థాయి దౌత్యాధికారి యాంగ్‌ జీషి(67)కి పదోన్నతి లభించింది. వయస్సు రీత్యా ఆయన పదవీ విరమణ చేస్తారని భావించారు. అయితే, యాంగ్‌ జీషీతో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి(64) కూడా 204 మంది సభ్యులుండే కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు.  

views: 980



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams