మాణిక్‌చంద్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రిశిక్లాల్ మాణిక్‌చంద్ ధారివాల్ (79) పుణెలో మృతి చెందారు. ఆయనకు భార్య శోభ, ఒక కుమారుడు, నలుగురు కుమార్త్ లున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా అందిన చిన్నపాటి బీడీ యూనిట్ నిర్వహించిన ఆయన తరవాత గుట్కా వ్యాపారం ప్రారంభించి, భారీ స్థాయిలో విస్తరించారు. ప్యాకేజింగ్, రోలర్ ఫ్లోర్‌మిల్స్, స్థిరాస్తి, పవన విద్యుత్తు, ప్యాకేజ్డ్ తాగునీరు వంటి వ్యాపారాలకు విస్తరించారు.
views: 946