Current Affairs Telugu Daily

మహిళా బైక్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా బైక్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌(32) 2017 అక్టోబర్‌ 24 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భర్త అబ్దుల్‌ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. చిన్నప్పటి నుంచే బైక్‌ రైడింగ్‌ను అలవర్చుకున్న సనా ఇక్బాల్‌ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఒంటరిగా బైక్‌పై ప్రయాణించి ప్రముఖ మహిళా రైడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆమె సుమారు 38వేల కి.మీ.లు బైక్‌పై ఒంటరిగా ప్రయాణించింది. బైక్‌ రైడింగ్‌తో పాటు ఆత్మహత్య నివారణ కోసం విశేష కృషి చేసి గుర్తింపు పొందారు. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే యువతులను, బాలికలను చైతన్యపరిచే కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు. 
views: 1128

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams