Current Affairs Telugu Daily

రాష్ట్రంలో మరో 3 పట్టణాభివృద్ధి సంస్థలు 
రాష్ట్రంలో మరో 3 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం నగరపాలక సంస్థల పరిధిలో గ్రామాలను కలిపి వీటిని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ చుట్టు పక్కల ఉన్న మరో 71 గ్రామాలను కలిపి శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థను, ఖమ్మం నగరపాలక సంస్థతోపాటు మరో 46 గ్రామాలను కలిపి స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ, నిజామాబాద్‌ నగరపాలక సంస్థతోపాటు మరో 60 గ్రామాలను కలిపి నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ 2017 అక్టోబర్‌ 24న ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాభివృద్ధి సాధికార సంస్థకు ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ వ్యవహరిస్తారు. పురపాలకశాఖ కార్యదర్శి, స్థానిక శాసనసభ్యుడు, పురపాలక శాఖ డైరెక్టర్‌, పట్టణ, గ్రామీణ ప్రణాళిక డైరెక్టర్‌(డీటీసీపీ) సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థతోపాటు వరంగల్‌ నగరపాలక సంస్థతో కలిపి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఉన్నాయి.
views: 1011

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams