Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం నిర్వహించారు. 
-    - ఐక్యరాజ్యసమితి సెక్రటరి జనరల్‌ - ఆంటోనియో గుట్టెరస్‌
-        యునైటెడ్‌ నేషన్స్‌ అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్‌  డి. రూజ్‌వెల్ట్‌ సూచించాడు. 
-    1945 ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 26 వరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యుఎన్‌ చార్టర్‌ను రూపొందించాయి. 
-    1945 జూన్‌ 26న చార్టర్‌పై 50 దేశాలు సంతకాలు చేశాయి. 1945లోనే భారత్‌ కూడా సభ్యత్వం పొందింది. 
-    శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలెండ్‌ దేశం చార్టర్‌పై సంతకం చేసి 51వ సభ్య దేశంగా అవతరించింది. 
-    190వ సభ్యదేశంగా స్విట్జర్లాండ్‌, 191వ సభ్యదేశంగా తూర్పు తిమోర్‌ చేరాయి. 
-    2006, జూన్‌ 3న సెర్బియా నుండి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన ‘మాంటెనీగ్రో’ 2006 జూన్‌ 28న ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్యదేశం కాగా, 2011లో దక్షిణ సూడాన్‌ 193వ సభ్య దేశంగా చేరింది. 
-    తైవాన్‌, వాటికన్‌ సిటీ, లీచ్‌టెన్‌ స్టీన్‌ సభ్యత్వం లేదు.
-    1945       అక్టోబర్‌ 24 నుండి ఐక్యరాజ్యసమితి  అధికారికంగా పనిచేయటం ప్రారంభించింది. 
-    ప్రతి సం॥ అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం. 
-    ఐక్యరాజ్యసమితికి, దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్‌కు 2001 సం॥లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
-    ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు కారణమైన అట్లాంటిక్‌ చార్టర్‌పై బ్రిటిష్‌ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్ట్‌ 1941 ఆగస్టు 14న సంతకాలు చేశారు.
-    ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి సమావేశం 1946 జనవరిలో లండన్‌లో జరిగింది.
-    ఐక్యరాజ్యసమితి  యొక్క జెండాను 1947 అక్టోబర్‌ 20న సాధారణ సభ ఆమోదించింది. 
-    ఐక్యరాజ్యసమితి యొక్క జెండా లేత నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెల్లరంగులో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబుకు ఇరువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌ కొమ్ములు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పు 3 : 2 నిష్పత్తిలో ఉంటాయి.
-    ఐక్యరాజ్యసమితి పతాకాన్ని 1947లో ఆమోదించారు.
-    ఐక్యరాజ్యసమితి       రాజ్యాంగంలోని ప్రవేశిక యొక్క ముసాయిదాను జాన్‌ క్రిస్టియాన్‌ (దక్షిణాఫ్రికా) రచించారు.
-    అధికార భాషు : అరబిక్‌, చైనీస్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌.
-    ప్రధాన అంగాలు : 
    1. జనరల్‌ అసెంబ్లీ
    2. సెక్రటేరియట్‌
    3. సెక్యూరిటీ కౌన్సిల్‌
    4. ట్రస్టీషిప్‌ కౌన్సిల్‌
    5. ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌
    6. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌
-        ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌ (అమెరికా)
-    సభ్యులు సంఖ్య : 193

views: 1308

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams