Current Affairs Telugu Daily

దేశభక్తి రుజువునకు సినిమా హాళ్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదు : సుప్రీం 
ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవాలంటే సినిమా హాళ్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జాతీయ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని ‘తక్కువ దేశభక్తులు’గా పరిగణించజాలమని పేర్కొంది. ఈ లెక్కన చూస్తే- ప్రజలు టి-షర్టులు, పొడవు నిక్కర్లతో సినిమాలకు వస్తే జాతీయ గీతాన్ని అవమానపరచడమే అవుతుందంటూ ప్రభుత్వం ఈసారి వాటిపైనా నిషేధం విధించవచ్చని వ్యాఖ్యానించింది. సమాజానికి నైతిక పోలీసింగ్‌ అవసరం లేదని తేల్చిచెప్పింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా వినిపించాలన్న ఉత్తర్వుల్ని సవరించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా- సినిమా మొదలయ్యేముందు జాతీయ గీతాన్ని వినిపించడం, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవడం తప్పనిసరి అని 2016 నవంబర్ 30న సుప్రీంకోర్టు ఆదేశించింది.  శ్యాంనారాయణ్‌ ఛోక్సీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఉత్తర్వుల్ని పునఃసమీక్షించాలంటూ కేరళకు చెందిన కొడుంగల్లూర్‌ ఫిలిం సొసైటీ పిటిషన్‌ దాఖలు చేసింది. మునుపటి ఉత్తర్వుల ప్రభావానికి లోనుకాకుండా దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం 2017 అక్టోబర్ 23 న  తెలిపింది.
- భారత అటార్నీ జనరల్‌ : కె.కె.వేణుగోపాల్‌

views: 949

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams